30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఅరెస్ట్ పై కండన..

అరెస్ట్ పై కండన..

అరెస్ట్ పై కండన..

నిజామాబాద్: 6 జనవరి

తొర్లికొండ PACS కాటిపల్లి గంగారెడ్డి తెల్లన్న మాజీ అధ్యక్షున్ని గురువారం రాత్రి జక్రన్ పల్లీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని కోటపాటి ఖండిచారు…1964 Co-op చట్టం ప్రకారం ఏదైనా సొసైటీలో అక్రమాలు జరిగితే జిల్లా కో ఆపరేటివ్ అధికారి దర్యాప్తు చేసి రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ నివేదిక ఇవ్వాలి. కమిషనర్ ప్రాసిక్యుషన్ కు అనుమతి ఇస్తే, అప్పుడు DCO పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలి. పోలీసులు లేదా DCO నోటీసు ఇచ్చి జవాబు తీసుకొని అనంతరం అరెస్టు చెయ్యాలి. కానీ ఇవేమీ పాటించకుండా జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ( DCO ) తనకు లేని అధికారాలు ఉపయోగించి పోలీసులను తప్పుదోవ పట్టించి కాటిపల్లి గంగారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. శుక్రవారం జిల్లా కారాగారవాసంలో దక్షిణ భారతదేశ రైతు సంఘాల అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు, తాటిపల్లి గంగారెడ్డిని కలిసి వివరాలు తెలుసుకొన్నారు. ఆయన హయాంలో ఇచ్చిన రుణాల విషయం కానీ , కట్టిన మడిగెలు కానీ , ఏ విధమైన అక్రమాలు జరగలేదు . నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్య తీసుకోలేదు స్థానిక రాజకీయాల కోసం తన పై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. తనపై అక్రమంగా కేసు పెట్టిన జిల్లా DCO , మరియు ప్రస్తుత సొసైటీ చైర్మన్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. కాబట్టి కాటిపల్లి గంగారెడ్డిని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోటపాటి డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్