యదాద్రి: 6 జనవరి
ఆత్మకూరు మండలం సింగారం గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య.. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ. యువత ఆదర్శంగా ఉంటూ క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని ఈ టోర్నమెంట్లతో క్రీడలను బతికిస్తున్నారని అన్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సెల్ ఫోన్ తో అన్ని రంగాల్లో ముందుఉన్న ఈ క్రీడలను నిర్వహిచటం ఈ సింగారం గ్రామ యువత ఆదర్శమన్నారు.క్రీడల్లో గెలుపు ఓటములు అనేవి సహజం కానీ ఈ క్రీడలు శారీర దారుడ్యానికి స్నేహభావం,గ్రామల మధ్య ప్రేమ పెంచుతుందని అన్నారు..ఆప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు పాటశాలలో ప్రత్యేక సమయం క్రీడలకు వుండేదని అన్నారు.యువత ఐక్యమత్యంగా ఉంటే దేనినైనా సాధించవచ్చని అన్నారు.సింగారం గ్రామం ఏర్పాటు చేసిన ఈ టోర్నమేంట్ తో రాష్ట్రంలో, జిల్లా లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు..యువతకీ ఎప్పుడు ఏ అవసరం ఉన్న నేను ముందు ఉండి మీకోసం కృషి చేస్తానని బీర్ల అయిలయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, స్థానిక సర్పంచ్ జామ యాదయ్య, పాక్స్ చైర్మన్ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బత్తిని ఉప్పలయ్య, పోతగాని మల్లేశం, దేవరపల్లి ప్రభాకర్ రెడ్డి,పల్సం రాజు,ఎలగందుల శ్రీను, కోరే మల్లేశం అంబటి కిరణ్, విఘ్నేష్, సురేందర్, సుభాష్, కిరణ్, భరత్, పవన్, తదితరులు పాల్గొన్నారు.