వైద్యుల నిర్లక్ష్యంతో గర్భవతి మృతి..
ఆర్మూర్: 7 జనవరి యదార్థవాది ప్రతినిది
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డొంకేశ్వర్ గ్రామానికి చెందిన పెంటాల శ్రీలత ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. శనివారం సాధారణ డెలివరీ అయ్యిందని బాబు పుట్టిన తరువాత కాసేపటికి శ్రీలత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శ్రీలత మరణించిందని, శ్రీలత కుటుంబ సభ్యులు కొద్ది సేపు దర్ననివహించారు. విషయం తెలుసుకున్న పోలీసు బందోబస్తు మధ్య పోస్టుమార్టంకు ప్రయత్నించగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. శ్రీలత మృతిపై ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు మాట్లాడుతూ సాధారణ ప్రసవం నిర్వహణలో బాబు పుట్టాడని కొద్ది సేపటికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో మరణించిందని తెలిపారు.