కోర్టు డ్యూటీ అధికారులతో చట్టపరమైన సమస్యలపై చర్చ..
సిరసిల్ల: 7 జనవరి యదార్థవాది
సిరిసిల్ల జిల్లా కోర్ట్ ప్రాంగణంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్స్ లక్ష్మీ ప్రసాద్, నర్సింగరావు, అదనపు ఎస్పీ చంద్రయ్య, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తెలంగాణ ఆదేశాల మేరకు శనివారం కోర్టు డ్యూటీ అధికారులు తో చట్టపరమైన సమస్యలపై చర్చించారు. ఇటీవల కాలంలో నమోదు అయిన కేసులకు సంబంధించి కోర్టు విధి విధానాల గురించి జిల్లాలోని పోలీస్ అధికారులతో చర్చించరు..పోలీస్ స్టేషన్ల పరిధిలోని నమోదైన కేసులలో నాణ్యమైన దర్యాప్తు చేపడుతూ కోర్ట్ డ్యూటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కోర్టు ట్రయల్ కు ఎప్పటికప్పుడు హాజరవుతో నేరారోపణల శాతం పెంచడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపిపి సందీప్, సతీష్. డిసీఆర్బీ డిఎస్పీ బాలకిషన్, సి.ఐ అనిల్ కుమార్, మోగిలి, ఉపేందర్, నవీన్ కుమార్, ఎస్.ఐ లు కోర్టు డ్యూటీ అధికారులు, స్టేషన్ రైటర్స్ పాల్గొన్నారు..
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/29..-7-1024x440.jpg)