రైతుల భూముల జోలికి రావద్దు..
ఆర్మూర్: 8 జనవరి యదార్థవాది
* ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి..సిపిఐ (ఎంఎల్)
* ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలి..
కామారెడ్డి జిల్లాలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో కెసిఆర్ ప్రభుత్వం పారిశ్రామిక వాడ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలని చుస్తోందని, అధికార పార్టీ నేతల లబ్ధికోసమే తప్ప ప్రజలకు మేలుచేయడానికి కాదని సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆర్మూర్ లో ఆదివారం పత్రికసమవేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూములను లాక్కుంటే రైతులు, ప్రజలు, ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోమని, తమ భూముల రక్షణ కోసం రైతులు చేస్తున్న పోరాటానికి ప్రజాపంథా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులతో చర్చించి, వారి వ్యవసాయ భూములకు నష్టం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి ప్రజలను, రైతులను అనేక గందరగోళాలకు గురిచేసిందని, భూ పరిష్కారం కోసం కోర్టుల, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని, ధరణి పోర్టల్ భూస్వాములకు వరంగా, సామాన్య పేద ప్రజలకు సమస్యల నిలయంగా మారిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూములను, దేశాసైనికులకు ఇచ్చిన భుములను ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వం లాక్కుంటుందని, ఇప్పటికైనా ధరణి పోర్టల్ రద్దు చేయాలని తెలిపారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసిఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని వాయిదాల పర్వం కొనసాగిస్తుందని, ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యకమంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, రాష్ట్ర నాయకులు వి. ప్రభాకర్ జిల్లా నాయకులు ఎం.నరేందర్, బి.దేవారం, ఎం. వెంకన్న, డి.రాజేశ్వర్, బి.మల్లేష్, పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.