హిందువులు మస్జీద్ లోకి రావాలి..
సిద్దిపేట: 9 యదార్థవాది ప్రదినిది
* మొహమ్మద్ ప్రవక్త బోధనలు అందరికి తెలవాలి..
* మతం కాదు మానవత్వం కావాలి..
తెలంగాణాలో మతలకతితంగా శాంతి సౌభాగ్యలతో వెలసిల్లాల్సిన సమయం ఆసున్నమైందాని తెలంగాణ జమాయితే ఉలేమా సంస్థ అధ్యక్షులు నిసార్ ఖాస్మి అన్నారు..జమయితే ఉలేమల ఆధ్వర్యంలో నిర్వహించిన సిరత్ ఖ్విజ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సిద్దిపేట ఈద్గాఅహ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త బోధనలు అందరికి తెలవాలి, హిందువులు మస్జీద్ లోకి రావాలి, మతం కాదు మానవత్వం గొప్పదని అందరు గుర్తించాలని అన్నారు. తప్పు దారిపడుతున్న యువత సరైన దారిలో నడిచి ఉన్నతంగా ఎదగాలని, ఇస్లాం బోధనే శాంతి, సమానత్వం మొహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో నడవాలన్నారు. జమయితే ఉలేమా సిద్దిపేట సంస్థ అద్భుతంగా పనిచేస్తుందని, రాష్ట్ర శాఖ ఆదేశాలతో ప్రతి జిల్లాలో సిరత్ పోటీలు నిర్వహించామని ఇందులో 40 శాతానికి పైగా ముస్లిమేతర విద్యార్థులు పాల్గొనడం శుభపరిణామామన్నారు. ఈ కార్యక్రమంలో జమయితే ఉలేమా జిల్లా అధ్యక్షులు ముఫ్తి సలాం, తంజీముల్ మసాజిద్ అధ్యక్షులు జావేద్,మిల్లతే ఇస్లామియా అధ్యక్షులు ఖాదర్, బిఆర్ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఫక్రుద్దీన్,ఉలేమాలు తదితరులు పాల్గొన్నారు.