తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
25,050 మంది అభ్యర్థులు అర్హులు
మెయిన్ పరీక్ష విధానం 18వ తేదీన వెల్లడి
హైకోర్టు ఆదేశాలతో సమాంతర రిజర్వేషన్లు
ప్రతి సామాజిక వర్గంలో 1:50 మంది ఎంపిక
హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలను టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. జూన్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. దేశంలోనే తొలిసారిగా సామాజికన్యాయాన్ని అనుసరించి మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. దేశంలో తొలిసారిగా అన్ని సామాజికవర్గాలకు సమన్యాయాన్ని టీఎస్‌పీఎస్సీ అమలు చేసింది. ప్రతి సామాజికవర్గం నుంచి 50 మందిని ఎంపిక చేయగా, మొత్తం 25,050మంది మెయిన్‌కు అర్హత సాధించారు. తొలుత 1:50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 503 ఉద్యోగాలకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తే.. 25,150 మంది మెయిన్‌కు అర్హత* *సాధించాలి.అయితే మల్టీజోన్-2లో మహిళల క్యాటగిరీలో దృష్టిలోపం, జనరల్ క్యాటగిరీలో వినికిడిలోపం ఉన్న* *అభ్యర్థులు 111 మంది తక్కువగా ఉన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న కమిషన్ మెయిన్‌కు 25,050* *మందిని ఎంపిక చేసింది.హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో సమాంతర విధానంలో ఎంపిక చేపట్టింది. ఏ క్యాటగిరీలోనూ క్వాలిఫై మార్కుల ప్రకారం* *మెయిన్‌కు ఎంపిక చేయలేదు. యూపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ వంటి కమిషన్లు ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాల విడుదలలో అభ్యర్థులు సాధించిన క్వాలిఫై మార్కులను
వెల్లడించవు.
503 మొత్తం పోస్టులు
3,80,081 దరఖాస్తుదారులు
2,85,916 ప్రిలిమ్స్‌కు హాజరు
25,050 మెయిన్‌కు ఎంపిక
5 ప్రశ్నల తొలగింపు
రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ గత ఏడాది ఏప్రిల్ 26న నోటిఫికేషన్ వెలువరించింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రాథమిక కీ ప్రకటించి, అభ్యంతరాలను ఆహ్వానించింది. నిపుణుల కమిటీతో చర్చించి నవంబర్ 14న ఫైనల్ కీ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి 5 ప్రశ్నలను తొలగిస్తూ కమిషన్ నవంబర్ 15న తుది కీ ప్రకటించింది. మాస్టర్ ప్రశ్నపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. గ్రూప్ -1 పరీక్షలో మొత్తం 150 మారులకు 5 ప్రశ్నలను తొలగించినందున.. మిగిలిన 145 ప్రశ్నలకు వచ్చిన మారులను 150 మారులకు దామాషా పద్ధతిలో వర్తింపజేసి, తుది మారులను లెకించింది. ఉదాహరణకు.. 145 మారులకు 120 వస్తే 150కి లెకించి 124.137గా నిర్ణయించారు. ఇలా మూడో డెసిమల్ పాయింట్ వరకు పరిగణనలోకి తీసుకొని తుది మెరిట్ జాబితాను కమిషన్ రూపొందించింది. ఆ లెక్క ప్రకారమే మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే, బబ్లింగ్‌లో పొరపాట్లు చేసిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు పరిగణలోకి తీసుకోలేదని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఒకవేళ రెండు లేదా అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులు, స్థానికత సమానంగా ఉంటే.. పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు.
పూర్తి సమాచారం కోసం..
ఈ నెల 18వ తేదీన మెయిన్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను http://ww w.tspsc gov in వెబ్‌సైట్‌లో పొందు పరుస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పూర్తి సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌లైన్ 040-2244 5566, 040-23542185, 040-23542 187 నంబర్లలో (ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సంప్రదించాలని సూచించారు.
కోర్టు కేసులతో ఫలితాల జాప్యం
అక్టోబర్ నెలలోనే ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో ఆలస్యమైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలకు బుధవారమే హైకోర్టు బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో శుక్రవారం టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసింది. ప్రిలిమ్స్ ఫలితాలకు మెయిన్ పరీక్షకు కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని కమిషన్ భావించింది. అయితే.. మే 28వ తేదీన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జూన్ నెలలో మెయిన్ పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. అభ్యర్థులకు లభించనున్న 6 నెలల విరామం వారి ప్రిపరేషన్‌కు ఉపకరించనున్నది.