భారత్ జోడో యాత్ర’లో విషాదం
చండీగఢ్: 14 యదార్థవాది ప్రతినిది
కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్ర’లో విషాదం అలుముకుంది.. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరీ గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్‌లోని ఫిలౌర్ ప్రాంతంలో శనివారం ఉదయం యాత్రలో పాల్గొని రాహుల్ గాంధీతో కలిసి నడిచిన జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను లూధియానాలోని ఆసుపత్రికి తరలింగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంపీ మరణవార్త విన్న రాహుల్ యాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. సంతోఖ్ సింగ్.. 1946 జూన్ 18న జలంధర్‌లోని ధలివాల్ ప్రాంతంలో జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ఎంపీ సంతోఖ్ సింగ్ కు ప్రముఖుల సంతాపం..తెలిపిన వారిలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ఎంపీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సంతోఖ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు..