ఆలయం అభివృద్ధి జరగాలి..
సిద్దిపేట: 16 యదార్థవాది ప్రతినిది
దుబ్బాక నియోజకవర్గం లోని పెద్ద గుండవెల్లి రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలోకి నియోజకవర్గం పలువురు ప్రజలు కోరుతున్నారు..రేణుక ఎల్లమ్మ దేవాలయానికి సిద్దిపేట జిల్లా కాకుండా ఇతర రాష్ట, జిల్లాల నుండి ప్రతి ఆదివారం, మంగళవారాల్లో జాతర సందడి, పెద్ద సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకుంటారు.
ఈ దేవాలయాన్ని దేవదాయ శాఖ అధీనంలోకి తీసుకుంటే సంబంధిత అధికారి, చైర్మన్ ఆలయ అభివృద్ధి వారి ఆధీనంలో ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇలాంటి అధికారి లేక, పాలకవర్గం లేక ఇస్తాను సరంగా, అక్కడ వుండే నాయకులదే పెత్తనం. ఇప్పటికైనా పెద్ద గుండా వెళ్లి రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో చేర్చి ఆలయ అభివృద్ధికి పలువురు కోరుతున్నారు..