రాపిడ్ యాక్షన్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్..
ఆదిలాబాద్: యదార్థవాది ప్రతినిది
* పట్టణంలోని అన్ని సమస్యత్మక కాలనీలలో కవాతు నిర్వహణ.
* శాంతిని కోరుకుంటున్న జిల్లా ప్రజలు
రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతును ప్రారంబించిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్.. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతు గురువారం నుండి ఈ నెల 24 వరకు ఆదిలాబాద్ పట్టణం, ఉట్నూర్, బోథ్, నేరడిగొండ, జైనథ్, ఇచ్చోడా లలో వారం రోజులపాటు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలియజేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంతమైన వాతావరణంలో శాంతిభద్రతల సమస్యలు తల్లేత్తకుండా ముందస్తుగా, ర్యాలీలు నిర్వహిస్తుంటామాని, ఆర్ఏఎఫ్ శిక్షణలో భాగంగా వారం రోజులపాటు ఆదిలాబాద్ లో శాంతిని కోరుకుంటున్న జిల్లా ప్రజల విశేష స్పందన, కేంద్ర బలగాలను ఘనంగా స్వాగతించలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి పరిపాలన ఎస్ శ్రీనివాసరావు, అదిలాబాద్ పట్టణ డిఎస్పి వి ఉమేందర్, ఆర్ ఎ ఎఫ్ డి ఎస్ పి శశాంక్, ఒకటవ పట్టణ సీఐ కె సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
