రాష్ట్ర వ్యాప్తంగా 16533 కేంద్రాల్లో, 1500 బృందాలు పనిచేస్తున్నాయి
హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతిలు పాల్గొన్నారు. బుదవారం ఖమ్మంలో కెసిఆర్ ఘనంగా కంటి వెలుగు ప్ప్రారారంబించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. “రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలు పనిచేస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 16533 కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. గ్రేటడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ వాళ్ళు కావాలంటే జీహెచ్ ఎంసీ కి ట్విట్టర్, వెబ్ సైట్ లో రిక్వెస్ట్ పెట్డిన వెంటనే కంటి వెలుగు బృందాలు వస్తాయని, అంధత్వ సమస్యలు నిర్ములించాలన్నదే మా ప్రబుత్వ లక్షం అని తెలిపారు. 2018 మొదటి విడత కార్యక్రమం 8 నెలలో పూర్తి చేశాం. ఈసారి తెలంగాణలో తయారైన కళ్లద్దాలు మాత్రమే పంపిణీ చేయనున్నాం. 20 లక్షల కళ్ళజోళ్ళు పంపిణీ చేసే అవకాశముందని, స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా అంత కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. తెలంగాణలో కల్యాణ లక్ష్మీ, ప్రభుత్వ మెడికల్ కాలేజి, రైతు బంధు, కేసీఆర్ కిట్ ఇలాంటివి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.