కూడవెళ్ళి జాతర ఏర్పాట్లు పూర్తి
సిద్దిపేట: యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కూడవెళ్ళి రామలింగేశ్వర స్వామి జాతర భద్రత ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్.. కూడవెళ్ళి వాగు పరివాహక పరిసరాలను, భక్తుల దర్శనం ఏర్పాట్లను పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శన ప్రదేశాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని టెంపుల్ ఈఓ విశ్వనాధ శర్మ, పోలీస్ అధికారులకు సూచించారు. భూంపల్లి చౌరస్తా కూడవెళ్ళి కమాన్ నుండి వచ్చే వాహనాలు గ్రామ శివారులో చెరువు పక్కన పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరం పల్లి నుండి వచ్చే వాహనాలు వాగు అవతల రామేశ్వరం పల్లి గ్రామ శివారులో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్టీసీ బస్సులకు టెంపుల్ సమీపంలో వాగు దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, దర్శనానికి వచ్చే భక్తులు పోలీసుల సలహాలు సూచనలు తప్పక పాటించలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి ఫణీందర్, దుబ్బాక సీఐ కృష్ణ, టెంపుల్ ఈఓ విశ్వనాధ శర్మ, టెంపుల్ చైర్మన్ చంద్రం, మరియు పూజారులు కార్యవర్గ సభ్యులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.