కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు…ఏడుగురి మృతి..వరుస కాల్పుల ఘటనలతో దద్దరిల్లిన అమెరికా..
యధార్థవాది కాలిఫోర్నియా (యూఎస్):
అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే నగరంలో మంగళవారం ఓ దుండగుడు ఏడుగురిని కాల్చిచంపాడు.నిన్న చికాగోలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డారు…అమెరికాలో వరుస కాల్పులు
అమెరికాలో వరుసగా మూడు కాల్పుల ఘటనలు జరిగాయి. కాల్పులు జరిపిన నిందితుడు తమ కస్టడీలో ఉన్నాడని శాన్ మాటియో కౌంటీ ఒక ట్వీట్లో పేర్కొంది.కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్లో జరిగిన చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్లో 72 ఏళ్ల వ్యక్తి 10 మందిని చంపిన ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. పోలీసులు నిందితుడు ఉన్న వ్యాన్ వద్దకు వెళ్లేసరికి తుపాకీ శబ్దం వినిపించింది.