పద్మ అవార్డుల గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన..రేవంత్
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పద్మ భూషణ్, పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు పొందిన ప్రముఖులకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన మొత్తం 106 పద్మ అవార్డులలో తెలుగు వారికి 12 పద్మ అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పద్మ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు..