ఎందరో త్యాగదనుల ఫలితమే గణతంత్ర దినోత్సవం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
74 వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ శ్వేత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు కార్యాలయ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు పోలీస్ అధికారులు సిబ్బంది. ప్రజలతో మమేకమై విధులు నిర్వహించినప్పుడే ప్రజల ఆదరభిమానాలు మనపై ఉంటాయని. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశా నిర్దేశం చేశారు, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు విధులు నిర్వహిస్తున్నారు. ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి, వారి త్యాగఫలం ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా తారతమ్యాలు లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడే జన్మకు సార్థకత ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డిసిపిలు రామ్ చందర్ రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, సిసిఆర్బి ఏసిపి చంద్రశేఖర్, ఏఓ యాదమ్మ, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, ధరణి కుమార్, రాజశేఖరరెడ్డి, రామకృష్ణ, సూపరిండెంట్ జమాల్ అలీ. మరియు పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది సిఎఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు