చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవు.
యదార్థవాది ప్రతినిది మెదక్
అల్లాదుర్గ్ సర్కిల్ టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిదిలో శనివారం సాలోజీపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించిన సర్కిక్ ఇన్స్ పెక్టర్ జార్జ్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిసి కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలపై ఆవాహన కల్పించారు. వాహనాలకు సరి అయిన పత్రాలు ఉండాలని, ప్రతి ఒక్కరు రోడ్ భద్రత నియమాలను తప్పక పాటించాలని, సైబర్ నేరాలపై హవగాహన కలిగివుండాలని తెలిపారు. ఈ తనిఖీలలో సుమారు 200 ఇళ్లను సోదాలు చేశారు, పత్రాలు సరిగాలేని ద్విచక్ర వాహనాలు 16, ఒక ఆటో మొత్తం 17 వాహనాలను టేక్మాల్ పోలీస్టేషన్ తరలించారు. ఈ తనిఖీలో 43 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
