సీపీఐ ప్రజాపంథా సురేష్ ను పరామర్శించిన: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నిజామాబాద్ జిల్లా నాయకులు సురేష్ ను సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీపీఐ(ఎంఎల్) ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై డాక్టర్లను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. సురేష్ కు మంత్రి మనోధైర్యం నింపారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్,సహాయ కార్యదర్శి దేవారామ్,నిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ,రమేష్ తదితరులు ఉన్నారు..