హుండీల లెక్కింపు.
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మోహిని పుర వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం హుండీల ద్వారా వచ్చిన ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అర్చక బృందం,ఆలయ వంశపారంపర్య చైర్మన్ నగేష్ విష్ణు,ఆలయ ఈవో విశ్వనాధ్, దేవాదాయ,ధర్మాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ పరిశీలకులు రంగారావుల సమక్షంలో వికాస తరంగిణి,శ్రీ సంతోషి మాత సేవా సమితి,రాజ రాజేశ్వరీ సేవా సమితి సభ్యులతో కూడిన భక్త బృందం హుండీల లెక్కింపులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ ఈ ఓ విశ్వనాథ్ మాట్లాడుతూ 15-9-2022 నుండి 30-1-2023 వరకు దేవాలయానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించినట్టు తెలిపారు.మొన్నీమధ్యే ముక్కోటి ఏకాదశి మహా పర్వదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా వచ్చి ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని తెలిపారు. తేదీ 15.9.2022 నుండి 30.1. 2023 వరకు 138 రోజులకు గాను హుండీ లెక్కింపు జరపగా 16,07,295/-రూపాయలు వచ్చాయని ఈ రూపాయలను ఏపీజీవీబీ గ్రామీణ బ్యాంక్ లో జమ చేసినట్టు తెలిపారు.