విద్యార్థుల్లో ఆంగ్లభాషపై భయాన్ని పోగొట్టాలి.
-సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
పిల్లల్లో ఆంగ్ల భాషపై మక్కువ.. ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా భాషా పై భయం పోగొట్టే విధంగా స్పెల్ విజార్డ్, స్టోరీ టెల్లింగ్ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, ఎన్సీఈఆర్టీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో భారతి ఫౌండేషన్ వారి సహకారంతో జిల్లా స్థాయి పోటీలు సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పంది రాజమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్నేహపూర్వక వాతావరణంలో విద్యార్థులను ఆకట్టుకునేలా బోధన ఉండాలి. వరసల ఆవరణలో తరగతి గదిలో అన్న భాషలోని సంభాషణ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రము మరియు బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి బేతి భాస్కర్, ఎంఈఓ యాదవ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు గీత, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ ఎల్టా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎం కిరణ్మయి, ఎస్ జ్యోతి, ఆర్ జ్యోతి ,ఆస లక్ష్మణ్, సిహెచ్ పార్థసారథి, ప్రశాంత్, వి శ్రీనివాస్, పుల్లూరి ప్రభాకర్, మహేందర్ రెడ్డి, జయశీల, సరోజన, రవీందర్, వెంకటేష్, వైకుంఠం మరియు గైడ్ టీచర్లు పాల్గొన్నారు.