34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణవేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలి

వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలి

వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలి

దేశ సరిహద్దులో సిపాయి కార్మికులు.. గ్రామంలో సఫాయి కార్మికులు..

నిజాంబాద్ యదార్ధవాది ప్రతినిధి

సఫాయి కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆర్మూర్; ఆలూరు మండలంలోని పలు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి పిప్రి గ్రామపంచాయతి వర్కర్స్ తో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ సపాయి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 5 ఫిబ్రవరి 2023 తేదీన జక్రాన్ పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారని మహాసభలను హెచ్ఆర్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రపాటి మాధవరావు ప్రారంభిస్తారని, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. దేశ సరిహద్దులో సిఫాయి కార్మికులు, గ్రామంలో సఫాయి కార్మికులు ప్రజల కోసం తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్న విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలని, నేడు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని సఫాయి కార్మికుల వేతనాలు పెంచి వారిని పర్మినెంట్ చేయాలని దాసు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు పద్మ సత్యమ్మ ఎల్లమ్మ,చిట్టిబాబు భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్