కోటి తలంబ్రాలు దీక్షలో… శ్రీరామకోటి
యదార్థవాది ప్రతినిధి గజ్వేల్
భద్రాచంలో రాముల వారి కల్యాణానికి ఉపయోగించే కోటి తలంబ్రాల దీక్ష అద్భుత కార్యక్రమంలో పాల్గొనే ధార్మిక సంస్థలను భద్రాచల దేవస్థానం ఎంపిక చేసుకుంది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంస్థ వ్యవస్థాపక, అధ్యకులు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20సంవత్సరాల నుండి మా ఆధ్యాత్మిక సేవలు భద్రాచలం గుర్తించిందన్నారు. భద్రాచలం నుండి మాకు వడ్లు రావడం జరిగిందని భక్తులచే వాటిని గోతిలో మాత్రమే వొలిచి తిరిగి భద్రాచలం దేవస్థానానికి పంపాలి. వాటిని భద్రాచల దేవస్థానం వారు శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం సమయంలో ఈ తలంబ్రాలను సీతారాములకు ఉపయోగిస్తారన్నారు ఈ అదృష్టం మాకు రావడం చాలా అందంగా ఉందని రామకోటి సంస్థ భక్తులు కొనియాడారు ఈ కార్యక్రమం త్వరలో శ్రీకారం చుట్టనున్నామని సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు.