30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణకార్యదర్శులకు, ఎంపీవోలకు అవగాహన కార్యక్రమం

కార్యదర్శులకు, ఎంపీవోలకు అవగాహన కార్యక్రమం

కార్యదర్శులకు, ఎంపీవోలకు అవగాహన కార్యక్రమం

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

గ్రామాలలో అనుమతి లేకుండా గృహాల నిర్మాణం చేపడితే వారికి పంచాయతీ కార్యదర్శులు నోటీసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం లేఅవుట్ రూల్స్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ ఇతర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీవో లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అసైన్మెంట్, ఫారెస్ట్ భూముల్లో గృహాలు నిర్మించడానికి అనుమతి ఇవ్వరాదని తెలిపారు. పౌల్ట్రీ పామ్ కు అనుమతి ఇవ్వవద్దని చెప్పారు. సంబంధిత పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. సొంత స్థలంలో గృహాలు నిర్మించుకునే వారికి అనుమతి ఇవ్వాలని సూచించారు. చట్టం ప్రకారం లేఅవుట్ రూల్స్ పాటించాలని కోరారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తడి పొడి చెత్తను సేకరించే విధంగా చూడాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామాల్లోని రైతులకు విక్రయించి పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పొడి చెత్తను విక్రయించి ఆదాయాన్ని రాబట్టాలని కోరారు. గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి భూగర్భ జలాల పెంపునకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇంటి పనులు అన్ని గ్రామాల్లో 100% వసూలు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడారు. జిల్లాలో 146 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ లో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రత కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో చేపట్టాలని చెప్పారు. సమావేశంలో జెడ్పి సీఈవో సాయా గౌడ్, ఇన్చార్జి డిపిఓ సాయిబాబా, డిటిసిపిఓ నరహరి, డిఎల్పిఓ సురేందర్, రిలయన్స్ ఫౌండేషన్ డిపిఎం రాజు, ఎస్బిఎం సమన్వయకర్తలు మధు కృష్ణ, నారాయణ ఎంపీవోలు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్