కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం 100కోట్ల నిధుల ఉత్తర్వులు జారీ చేసింది… జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల చేసిన ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండగట్టు అభివృద్ధికి రూ.100కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆంజనేయస్వామి సన్నిధికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేదుకు 100కోట్ల నిధులు దోహత పడతాయని తెలిపారు. త్వరలోనే వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం భారతదేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా నిర్మిస్తామిన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.