సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు అవగాన కల్పించిన: డి.ఎస్.పి.సైదులు
యదార్థవాది ప్రతినిది మెదక్
మెదక్ రూరల్ సర్కిల్ హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ లింగసాన్ పల్లి తాండాలో మెదక్ డి.ఎస్.పి.సైదులు ఆద్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఈ కార్యక్రమలో భాగంగా సిసి కెమెరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు అవగాన కల్పించి సైబర్ నేరగాల వలలో పడవద్దని అప్రమత్తంగా ఉండాలని డయల్ 100 ప్రాముఖ్యత రోడ్డు ప్రమాదాల నివారణ అంశాలపై అవగాహన కలిగించారు. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని పోలిస్ అధికారులు తెలిపారు. పెండింగ్ చాలాన్, నంబర్ ప్లేట్ సరిగా లేని, పత్రాలు సరిగాలేని 29 ద్విచక్ర వాహనాలు, 01 ఆటో వాహనాలను అదుపులోకి తీసుకొని హవేలీ ఘనపూర్ పోలీస్టేషన్ తరలించారు.