ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు
యదార్ధవాది ప్రతినిది సిద్దిపేట
RBI ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2023 సంబందించిన పోస్టర్లను జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ముజమీల్ ఖాన్ అడిషనల్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్డ్ శ్రీనివాస్ రెడ్డి రెవిన్యూ వారిచే సోమవారం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యజిత్ మాట్లాడుతూ సరైన ఆర్ధిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది అనే అంశం మీద తేదీ 13.02.2023 నుండి 17.02.2023 వరకు జిల్లా లోని అన్ని బ్యాంకుల ద్వారా ఆర్థిక అక్షరాస్యత క్యాంపులు వివిధ గ్రామ పంచాయతీ మరియు మునిసిపల్ ప్రాంతాలలో నిర్వహించ బడుతాయి బ్యాంకు ద్వారా రుణాలను నిముషాల వ్యవధిలో పొందవచ్చు వృధా ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకోవాలి అని సూచించారు, సైబర్ నేరగాళ్ళనుండి కపడు కోవాలంటే బ్యాంకు నుండి వచ్చే ఓటిపి లుకానీ ఇతర లింక్లు కానీ ఫ్రీగా వచ్చే డబ్బులకు ఆశ పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు టోల్ ఫ్రీ నెంబర్ వాడాలని అందరిని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా లోని వివిధ బ్యాంకు మేనేజర్లు SBI, ICICI,Canara Bank and UBI , బ్యాంకు కస్టమర్లు , జిల్లా అధికారులు ,దయాకర్ ఆర్థిక అక్షరాస్యత జిల్లా కోఆర్డినేటర్ , CFL కోఆర్డినేటర్స్ శ్రీనివాస్, సాయి పాల్గొన్నారు