హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
మంచిర్యాల జోన్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త తిమ్మాపూర్ శివారు రాళ్ల వాగులో ఇటివల గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది.. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులైన మధ్యప్రదేశ్ చెందిన మిళింద్ రామ్టేకి, వికాస్ రంటేకి, విశ్వాస్ కృష్ణ కుమార్ భగాడి గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే నిందితులు మిళింద్, వికాస్ రంటేకె, విశ్వాస్ లు వారి స్వగ్రామంలో పనులు దొరకందున, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల, హాజీపూర్, వరంగల్, గోదావరిఖని, కరీంనగర్ లలో మేసిన్ పని చేయడం కొరకు తెలంగాణకు వచ్చి పోతుంటారు. గత ఏడాది క్రితం పని చేస్తుండగా మృతుడు రాకేశ్ బిల్డర్, మరి కొందరి దగ్గర డబ్బులు తిసుకోనివేల్లడు. ఈ డబ్బులు మిళింద్, వికాస్ రంటేకె, విశ్వాస్ తీర్చారు. డబ్బులను మోసం చేసి తీసుకొని, అడిగినందుకు తన నాన్న ని కొట్టడంతో రాకేశ్ ని ఎప్పటికైనా చంపేయాలి అని నిర్ణయించుకొని సరైన సమయం కోసం ఎదురు చూసారు. ఇంటి వద్దనే రాకేశ్ ని చంపితే పోలీస్ కేసులు అవుతాయి అని భయపడి, తెలంగాణ లో చంపితే ఎవరీ తెలియకుండా ఉంటుందని, గతం లో పనిచేసిన ఏదో ఒక ప్రదేశంలో చంపుదామని నిర్ణయించుకొన్నారు. ఇట్టి విషయం వీరి గ్రామస్థుడు ఐన విశ్వాస్ కి చెప్తే అందుకు అతను సరే అని సహాయం చేస్తా అన్నాడు. వారి పథకం లో భాగంగా తేదీ 30. 01.2023 రోజున వికాస్ మిలింద్ కి ఫోన్ చేసి రాకేశ్ కి పని ఉన్నది అని చెప్పి, మిలింద్ రాకేశ్ ని రామగుండం కి పని నిమిత్తం అని తీసుకువచ్చిడు. 04.02.2023 నాడు రాకేశ్ ని రామగుండం నుండి పని నిమిత్తం అని నిజామాబాద్ మంచిర్యాల, హైదరాబాద్ లలో తిప్పిరు 05.02.2023 మిలింద్ కి వికాస్ ఫోన్ చేసి రాకేశ్ ని తీసుకొని మంచిర్యాలకి రా, నేను విశ్వాస్ లము కూడా అక్కడికే వస్తున్నమని చెప్పగా హైదరాబాద్ నుండి బయలుదేరి 06.02.2023 రోజున ఉదయం అందజ 5 గంటల సమయంలో మంచిర్యాలకురాగా, వికాస్ మరియు విశ్వాస్ లు అప్పటికే మంచిర్యాల కి వచ్చిఉన్న పథకం ప్రకారం మిలింద్ రాకేశ్ తో కావాలనే గొడవ పడుతుండగా వెనక నుండి వికాస్ మరియు విశ్వాస్ లు ఇద్దరు అక్కడే ఉన్న కట్టెలతో రాకేశ్ వీపు లో కొట్టినరు. మిలింద్ చేతి కడియం తో రాకేశ్ నుదుటి పైన ముఖం పైన గట్టిగా గుద్దడం వల్ల రాకేశ్ కింద పడిపోయడు. ఎవరికి అనుమానం రాకుండా నీళ్ళలో ముంచి, మిలింద్ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ ని రాకేష్ మీద పడేసి ప్రమాదం లాగా క్రియేట్ చేయాలని అనుకోని, రాకేశ్ ప్రతిగటిస్తుండగా ముగ్గురు రాకేశ్ ను బలవంతంగా ఒడ్డు మీద నుండి గుంజుకొని వెళ్ళి వాగులోని నీళ్ళ లో పడేసి మిలింద్ వికాస్ లు మృతుడు రాకేశ్ గొంతు పట్టుకొని పిసుకుతూ నీటిలో ముంచగా, విశ్వాస్ రాకేశ్ ని కదలకుండా అతని రెండు కాళ్ళు పట్టుకున్నాడు. నీటిలో ముంచడం వల్ల మృతుడు రాకేశ్ నీళ్ళు మింగి ఊపిరి ఆడక చనిపోయినాడు. టెక్నాలజీ సాయంతో పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు మొబైల్ ఫోన్లు, రక్తపు మరకలు గల నేరస్తుల దుస్తులు,
ఒక చేతి కడెం, మూడు కత్తులు స్వాదినం చేసుకున్నారు. ఈ కేసును పరిష్కరించడంలో కృషి చేసినటువంటి మందమర్రి సిఐ ప్రమోద్ రావు, సర్కిల్ ఎస్ఐలను, సిసిఎస్ సిబ్బంది, మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరిని మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్నాథ్ కెకాన్ అభినందించడం జరిగింది.