మోడల్ ఆటోనగర్ లో నిర్మాణం పనులు పూర్తి: జిల్లా కలెక్టర్
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా 50 కోట్ల రూపాయల విలువైన 25 ఎకరాల స్థలంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో సిద్దిపేట ఇండస్ట్రియల్ పార్క్ లో మోడల్ ఆటోనగర్ కు గతంలోనే రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా శంకుస్థాపన చేసుకున్నామని ఆటోనగర్ లో నిర్మాణం పనులు పూర్తి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని కాన్ఫరెన్స్ హల్ లో ఆటో నగర్ యూనియన్ నాయకులతో మాట్లాడుతూ ఆటో నగర్ లో ఉన్న షాప్ ఓనర్లకు మాత్రమే అర్హులని TSIIC సంస్థ వారు పరిశ్రమలకు లీజ్ పద్దతిలో అందజేస్తామని ట్రేడ్ లైసెన్స్ పోటో కాపితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత పద్దతిలో సర్టిఫికెట్లు జారి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు పాల సాయిరాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.