విద్యార్థి దశనుండి ట్రాఫిక్ నిబంధనలు తెలుసు కోవాలి
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
తడ్కపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రత ప్రమాదాల గూర్చి అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసిపి ఫణీందర్ సిఐ రామకృష్ణ.. సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ ఏ కారణము లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమేనని ప్రతి ఒక్క వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు కిరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేస్తు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రత పాటించడం నేర్చుకోవాలని తెలిపారు…
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డుల గుర్తులను విద్యార్థులకు వివరించారు వేగంగా వెళ్లే వాహనానికి, సాధారణ స్పీడ్ తో వెళ్లే వాహనానికి తేలిక 15 నిమిషాలు మాత్రమే తేడా ఉంటుందని మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కారు నడిపేటప్పుడు సీటు బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని రోడ్డు ప్రమాదాల నివారణ గూర్చి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో హై స్కూల్ హెడ్మాస్టర్ మహతి లక్ష్మి అధ్యాపకులు ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.