రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
రైతుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు 10 వేలు ప్రకటించారని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల కొరకు బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీశారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతు బంధు రైతు భీమా నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా. ? తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండగా ఉన్నారని మంత్రి తెలిపారు. కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని రైతులను కేసీఆర్ ఓదారిస్తే బీజేపీ వంకర మాటలు మాట్లాడుతున్నదని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రం తరహా పాలన దేశంలో కావాలని పక్క రాష్ట్రాలలో ధర్నాలు నిరసనలు ఆందోళనలు అక్కడి ప్రజలు చేస్తున్నారని అన్నారు.
వడగండ్ల వానకు సీఎం కేసీఆర్ ఎకరాకు 10 వేలు ప్రకటిస్తే..10 వేలు చాలవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సన్నాయి నొక్కులు నొక్కతున్నారని మీకు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వేలు ఇస్తున్నారని కేంద్రం ప్రభుత్వం 10 వేలు ఇస్తే రైతుకు మేలుజరుగుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం నుండి 10 వేలు ఇప్పియలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చేర్పర్సన్ రోజా శర్మ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జిల్లా ఉద్యావన అధికారి టిఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.