శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలి కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు..
యదార్థవాది ప్రతినిది కరీంనగర్
రాబోవు రంజాన్ పర్వదినం సందర్భంగా నేపథ్యంలో మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు లేకుండా శాంతియుతంగా ఉండే ప్రాంతాలే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతాయని పండుగల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగలేదని, ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో ఉండాలని తెలిపారు. ఏవైనా సంఘటనలు జరిగినట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతను తెలుసుకొని ఉండాలని అత్యుత్సాహం ప్రదర్శించే చర్యలకు పాల్పడటం ద్వారా ఇబ్బందులు కలుగుతాయనే విషయాన్ని గుర్తించాలని మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదని కోరారు. మైనర్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ త్రిబుల్ రైడింగ్ లను ప్రోత్సహించకూడదని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్ ప్రొబేషనరీ ఐపీఎస్ గైట్ మహేష్ బాబా సాహెబ్ ఏసిపిలు తుల శ్రీనివాసరావు విజయ్ కుమార్ ఎస్బిఐ లు జి వెంకటేశ్వర్లు బి సంతోష్ కుమార్ లతో పాటుగా శాంతి కమిటీ సభ్యులు మధుసూధన్ రెడ్డి ఎం ఏ రఫీక్ జగదీష్ చారి ఇనుగుర్తి రమేష్ రాధా కిషన్ మన్సూర్ తవక్కలి సయ్యద్ ముజఫర్ ఘనశ్యామ్ ఓజా తదితరులు పాల్గొన్నారు.