30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సికింద్రబాద్ యదార్థవాది

రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగ అధికారుల సిబ్బందితో కమిషనర్ డి ఎస్ చౌహాన్ నేరేడ్ మెట్ లోని కమీషనర్ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.. కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న సైబర్ నేరాల శాతం పెరుగుతొందని వివిధ రకాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు ఉపయోగించక తప్పదని, కానీ అదే సమయంలొ సమాజం సైబర్ నేరాలపై అవగాహన కలిగి వుండాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేలా యువత భాగస్వామ్యంతో కళాశాలలు ఇతర ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. నకిలీ లాటరీలు నకిలీ ఉద్యోగ ప్రకటనలు నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం నకిలీ గిఫ్టు బాక్సుల వంటి పేరుతో ప్రజలను మోసం చేసే వారి పట్ల కఠిన శిక్ష అమలుచేస్తామని కమిషనర్ అన్నారు. సోషల్ మీడియాలో యువతులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదని అధికారులకు సూచించారు. పోలీసుల కృషి, కఠిన చర్యల వల్ల రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్ల బెడద చాలా వరకు తగ్గిందని, మహిళలు ప్రశాంతంగా బయటకు వెళ్లి తమ పనులు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టేలా అధికారులు క్రింది స్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది కలసి సమన్వయంతో పనిచేస్తేనే నేరాలు అదుపులో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీపీ సైబర్ క్రైమ్స్ అనురాధ ఐపీఎస్, డీసీపీ క్రైమ్ మధుకర్ స్వామి, సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశం, ఇన్స్పెక్టర్ లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్