సిరిసిల్ల మెడికల్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్!
సిరిసిల్ల యదార్థవాది
రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ
విద్యాసంవత్సరం నుంచి వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని స్పష్టం చేసింది. మంత్రి కే టి ఆర్ హర్షం రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేయడం పట్ల మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. తరగతులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వేగంగా మెడికల్ కాలేజీ భవన నిర్మాణం ఆధునిక హంగులతో చేపడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. అడ్మిషన్లకు అనుమతి మెడికల్ కాలేజ్ మంజూరు పట్ల జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రిని 300 పడకల మేర విస్తరించేందుకు సీఎం కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను చేపట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఫర్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) అనుమతులను ఇచ్చిందన్నారు.