నేరస్తులకు జీవిత ఖైదు పడేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించిన. పోలీస్ కమిషనర్
నిజామాబాద్ యదార్థవాది
జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరస్తులకు జీవిత ఖైదు పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు పోలీస్ సిబ్బందిని అభినందించిన ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ ప్రవీణ్ కుమార్.. నిజామాబాద్ డివిజన్ పరిధిలో టౌన్ 3, టౌన్ 5 పోలీస్ స్టేషన్లలో జరిగిన నేరాల నేరుద్ధులకు జీవిత ఖైదీ శిక్షలు పడే విధంగా కృషి చేసిన వారిని మంగళవారం పోలీస్ కార్యాలయంలో కమిషనర్ శాలువాలతో పుష్పబొక్కెలతో అభినందిస్తూ ప్రశంసా పత్రలు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు సిబ్బంది ఎల్లప్పుడు కేసులలో నేరస్థులకు తగు శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా కృషి చేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచన మేరకు కోర్టులో ఎవ్వరిని ఎప్పుడు హజరుపర్చాలనో వారిని సరియైన సమయంలో హజరుపర్చుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్) గిరిరాజు, అదనపు పోలీస్ కమీషనర్ అడ్మిన్ జి. మధుసుదన్ రావు, ఏసీపీలు ఎమ్. కిరణ్ కుమార్, నారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.