తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి..
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది
భారత చరిత్రలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లెప్రగతి దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు వెలుగొందుతున్నాయని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా జడ్పీ కార్యాలయంలో గురువారం జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొత్త పంచాయితీ రాజ్ చట్టం తెచ్చి గ్రామ పంచాయితీ విధులు, నిధులు, బాధ్యతలు పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం , ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని అన్నారు. పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని
సర్పంచులు, అధికారులు సమష్టిగా కృషిచేయడం వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం మన కావడం గర్వకారణమని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ జడ్పిగా అవార్డుకు ఎంపికైందని, 255 గ్రామపంచాయతీలు, 13 మండలాలు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ సర్వేక్షన్ లో వరుసగా మూడుసార్లు ఫోర్ స్టార్ రేటింతో తో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, జడ్పీటిసి లు, కొమిరిషెట్టి విజయ లక్ష్మణ్, గుగులోత్ కళావతి సురేష్ నాయక్, గుండం నర్సయ్య, జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.