ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి
ఆర్మూర్ యదార్ధవాది
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కారాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణకు రావడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూన్నమని, మన్యం విప్లవ వీరులు శ్రీ అల్లూరి సీతారామరాజు తన చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి ఆధ్యాత్మిక చింతనతో కాషాయంబదారిగా మారి ప్రజలలో ఆధ్యాత్మికంగా ఈ దేశం, ధర్మం పట్ల అవగాహన పెంచుతూ ఉన్న సమయంలో తెల్లదొరలు ప్రజలను నానారకాలుగా హింసించడం, అనవసరంగా రైతుల వద్ద పన్నులు వసూలు చేయడం, రైతులు పండించిన ధాన్యాన్ని సగానికి పైగా బ్రిటిష్ వారు తీసుకెళ్లడాన్ని చూసి జీర్ణించుకోలేని అల్లూరి సీతారామరాజు విల్లంబులు ధరించి తెల్లదొరలకు సింహ స్వప్నమై, ఓ అగ్గి బరాటాల, ఒక అగ్గి కణంగా మారి తెల్లదొరలకు అగ్గి పిడుగు గా మారి ముప్పు తిప్పలు పెట్టారని అన్నారు. పోలీసు కార్యాలయాలపై దాడులు చేసి తుపాకులను ఎత్తుకుపోవడం, మందు గుండు సామాగ్రితో వస్తున్నటువంటి రైళ్లపై దాడులు చేసి వాటిని స్వాధీనపరుచుకోవడంతో ముందున్నారని, సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పట్టించుకోకుండా తెల్లదొలకు వ్యతిరేకంగా పోరాటం చేశరని, అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని ఈ నయా నిజాం సర్కార్ కేసీఆర్ ప్రభుత్వాన్ని పారద్రోలడానికై ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు వినియోగించుకొవాలని, తెలంగాణలోని ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్న భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ దళిత మోర్చ కన్వీనర్ నల్ల రాజారాం, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, బిజెపి పట్టణ నాయకులు భవాని శ్రీకాంత్, కెలోత్ పీర్ సింగ్, బాసెట్టి రాజ్ కుమార్, గటడి శివ, పోహార్ నవీన్, రాము, పసుపుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.