మెడికో విద్యార్థినికి సహాయం..
సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
గోదావరిఖని యదార్థవాది
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్షిత కు మెడిసిన్ చదువు నిమిత్తం ప్రతినెలా అందించే సాయంలో భాగంగా రెండు వేల రూపాయల చెక్ ను గురువారం విద్యార్థిని తండ్రికి సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అందించారు. అనంతరం మల్లేష్ మాట్లాడుతూ సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో గత 18 నెలలుగా సాయి సుదీక్షిత కు ప్రతి నెల రెండు వేల రూపాయలను అందజేస్తున్నామని,ప్రతి ఒక్క సభ్యునికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి జూల వినయ్ తదితరులు పాల్గొన్నారు.