కార్మికులను అన్ని విదాలుగా ఆదుకుంటాం
పెద్దపల్లి యదార్థవాది
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు పోలీసులు అన్ని వేళల తోడ్పాటు అందిస్తుందని ప్రతి కార్మికునికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్మిక శాఖ అధికారులతో మాట్లాడి భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డ్స్, కార్మికులందరు ఇన్సూరెన్స్ ఇచ్చేవిదంగా త్వరలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు విజయేందర్, శ్రీనివాస్, అశోక్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు..