ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాలో ఇంత నిర్లక్ష్యమా.!
-విధులు అక్కడ, సమావేశాలు ఇక్కడ.
-ఆశా వర్కర్లంటే ఇంత నిర్లక్ష్యమా.
-ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైద్యాధికారులు.
-వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.
-సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఆరోగ్యశాఖ డైరెక్టర్ జడ శ్రీనివాస్ రావు వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ నిర్విరామంగా రాష్ట్రంలో పేదలకు వైద్యం అందేందుకు నిత్యం కృషి చేస్తుంటే సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు తమ సొంత జిల్లాలో డివిజన్ మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు మాత్రం ప్రభుత్వానిబంధనలు పట్టించుకోకుండా హుస్నాబాద్ డివిజన్ వైద్యాధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో విధులకు హాజరై ప్రజా ఆరోగ్యాన్ని అందరికీ అందించాల్సి వైద్యులు బాధ్యతాయుతంగా ఇక్కడ పనిచేయడం లేదని సమయపాలన కూడా పాటించకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలైన మీర్జాపుర్, అక్కన్నపెట, రామవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య శాఖ ఉద్యోగులై ఉండి ప్రజా ఆరోగ్యం పట్ల రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ రివ్యూ మీటింగ్ చూడాల్సిన వైద్యులు బాధ్యత మరిచి విధులు అక్కడ మిటింగ్ లు ఇక్కడ నిర్వహించడం ఏమిటని, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమే హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో పాల్గొని చేతులు దులుపుకోవడం ఏమిటని, నిత్యం ప్రజా ఆరోగ్య పట్ల విశేషంగా కృషి చేస్తున్నా ఆశా కార్యకర్తలను కటిక నేలమీద కూర్చోబెట్టి మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించడం ఆశ కార్యకర్తలంటే అంత చులకనగా చూడటం వైద్య అధికారులకు తగదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు నిఖిత, వినోద్, తులసి, సిహెచ్ఓ శబ్దప్రకాశ్, హెచ్ ఈవో సంపత్, సూపర్ వైజర్ వెంకటలక్ష్మి, కనకయ్య, హెచ్ వి ఏలగోండమ్మ,
ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొనడంపై వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రజా ఆరోగ్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుల పనితీరుపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులైన జిల్లా, డివిజన్, మండలాల వైద్యుల శాఖ పరమైన క్రమశిక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు..
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-06-at-6.05.48-PM1-1024x461.jpeg)