కొలువు తీరిన నూతన పాలకవర్గం
హుస్నాబాద్ యదార్థవాది
హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ దేవాలయం నూతన పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడు రేణుక ఎల్లమ్మను కోరుకుంటారని తెలిపారు. నూతనంగా ఏర్పడిన పాలకవర్గ ఆలయ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎల్లప్పుడు భక్తులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ ఆలయ అభివృద్ధి తోడ్పడతారని, రేణుక ఎల్లమ్మ దేవాలయనికి అన్నివిధాలుగా తోడుపటు నావంతు సహాయ సహకారాలు అందిస్తామని అలాగే నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ ఆకుల రజిత, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిని బిఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.