మోడీ సభకు భారీగా తరలి వెళ్లిన బిజెపి శ్రేణులు
సిద్దిపేట యదార్థవాది
తెలంగాణాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి పలు అబివృద్ది కార్యకమాలకు వస్తున్నా సందర్భంలో సిద్ధిపేట నుండి భారీగా తరలి వెళ్లిన బిజెపి శ్రేణులు.. వరంగల్ లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడి సభలో పాల్గొనేందుకు శనివారం బిజెపి శ్రేణులు సిద్దిపేట జిల్లా నుండి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో మోడీ సభలో పాల్గొనడానికి బిజెపి శ్రేణులు తరలివచ్చారని, ప్రధాని పాల్గొన్న సభ విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.. బిజెపి నాయకులు విద్యాసాగర్, అంబటి బాలేష్ గౌడ్ వంగ రామచంద్రారెడ్డి, కోడూరి నరేష్, ఉపేందర్ రావు, పత్రి శ్రీనివాస్ యాదవ్, తొడుకునూరి వెంకటేశం ,గాడి పల్లి అరుణ రెడ్డి తదితరులు మోడీ సభకు బయలుదేరినారులో ఉన్నారు.