శాంతి భద్రతలకే తనిఖీలు: సర్కిల్ ఇన్స్పెక్టర్
అల్లాదుర్గ్ యదార్థవాది
అల్లాదుర్గ్ సర్కిల్ రేగోడ్ పోలీస్ స్టేషన్ పరిది జగిర్యాల్ గ్రామంలో నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో తనిఖీలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జార్జ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల రక్షణ, భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని అన్నారు. కస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా సుమారు 200 ఇళ్లను సోదాలు చేశామని, ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించి, నంబర్ ప్లేట్, ద్విచక్ర వానాలు, పత్రాలు సరిగాలేని, 29 ద్విచక్ర వాహనాలను, 04 ఆటోలు, 02 బోలెరో లను రేగోడ్ పోలీస్టేషన్ కు తరలిస్తున్నమని, సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని అయన తెలిపారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని, గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావడం గొప్ప విషయమని, తమ గ్రామాల స్వీయ రక్షణలో ప్రజలు బాగస్వాములు కావాలని తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించడం జరుగుతోందని అన్నారు. ఈ తనిఖీలలో నలుగురు సబ్ ఇన్స్పెక్టర్, 28 మంది పోలీస్ లు పాల్గొన్నారు..