హుస్నాబాద్ లో కాంగ్రెస్ పై నిరసన..
-సబ్ స్టేషన్ ముందు రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి..
-రోడ్డుపై నిరసన తెలిపిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హుస్నాబాద్ లో సబ్ స్టేషన్ ముందు రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి వేసి అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు సీయం కేసీఆర్ అండగా నిలిస్తే… కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టకొట్టేందుకు చూస్తుందని ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బషీర్ బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టనపెట్టుకున్నాడని, ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఉచిత కరెంట్ వద్దంటున్నాడని, దేశానికి అన్నంపెట్టే రైతులు అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కండ్ల మంటేనని అయన అన్నారు. మొన్ననేమో ధరణి వద్దన్నారని, ఇప్పుడేమో ఉచిత కరెంట్ వద్దని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ దర్నలో జడ్పీ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీ మానస, హుస్నాబాద్ మున్సిపల్ చెర్ పర్సన్ ఆకుల రజిత, నియోజవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.