33.2 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణకొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.

కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.

కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.

హుస్నాబాద్ యదార్థవాది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9ఏళ్ళు అవుతున్న కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అక్కనపేట సీపీఐ పార్టి మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ ఆధ్వర్యంలో అక్కనపేట తహసీల్దార్ ఇ.సంజీవ్ కుమార్ వినతి పత్రం అందచేశారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 9ఏళ్ళు గా కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులలో సవరణలు లేకుండా తాత్సారం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సమస్యలను మర్చిపోయి ఎన్నికల హడావుడి చేస్తున్నారని అన్నారు. రైతుల పొట్ట కొట్టడానికే ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారని, రైతులు సాదా బైనమా, ఆర్.ఓ.ఆర్ లేకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా నిమ్మకు నిరత్తేనట్టు వ్యవహరిస్తోన్న పాలక ప్రభుత్వంపై సీపీఐ పార్టి ఆధ్వర్యంలో ఉద్యమించాల్సిందేనని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్ళీ అధికారం చేపటెందుకు ఎన్నో గారడీలు చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇప్పుడు ఎవరు నమ్మరని ఇప్పటికైనా వెంటనే ప్రజ సమస్యలు పరిష్కరించాలని, లేనిచో రానున్న రోజుల్లో సీపీఐ ప్రజా ఉద్యమలు నిర్వహించి బిఆర్ఎస్ ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అయన అన్నారు. కార్యక్రమంలో కొమ్ముల పార్శరాములు, కిన్నెర కొమురయ్య, గంగయ్య, అత్తెన సంపత్, వరుకుటం కొమురయ్య, ఉల్లి సంపత్, రాజకొమురయ్య, సరిత, రాజవ్వ, లక్ష్మీ, రాజవిరు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్