30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఅధికార యంత్రాంగంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహింహిన: మంత్రి హరీష్

అధికార యంత్రాంగంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహింహిన: మంత్రి హరీష్

ఉమ్మడి మెదక్ జిల్లా అధికార యంత్రాంగంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహింహిన: మంత్రి హరీష్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అత్యవసర, అవసరమైన ఆదేశాల జారీ చేస్తున్నారని, వాటిని అనుసరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి హరీశ్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.. గురువారం జిల్లాల వారీగా పరిస్థితులపై ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాల వలన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వాగులు వంకలు అన్ని పూర్తిగా నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టులు, చెరువులు పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి సూచించారు. వరద, వర్షం నీటికి రహదార్లు చెడిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని, అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాటర్ ఫ్లోతో ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలని, నిరంతర వానలకు గోడలు బాగా తడిచి ఉంటాయని, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజల్ని తరలించి తాత్కాలిక క్యాంపులు, రిహాబిలిటేషన్- పునరావాస చర్యలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగంకు మంత్రి ఆదేశించారు.. చెరువులు నిండి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు నిత్యం పర్యవేక్షించాలని, మత్స్యకారులను వెళ్లకుండా చూడాలని, మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల వద్ద వరద ఉధృతి పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా మానిటరింగ్ చేయాలని తెలిపారు. మెదక్ 157, సిద్ధిపేట 257, సంగారెడ్డి 227 ఇల్లు పాక్షికంగా కూలిన నేపథ్యంలో వారికి అండగా నిలవాలని ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ఉంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు తెల్సుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సిద్ధిపేటలో 660 చెరువులు పూర్తిగా నిండిన నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. కేసీఆర్ కిట్ సమాచారం ఆధారంగా డెలివరీ అయ్యే గర్భిణీల వివరాలు ముందుగా తెలుసుకొని వారి ఆరోగ్యాలు పర్యవేక్షించాని, 3,4 రోజుల ముందుగానే అడ్మిట్ చేసుకోవాలని తెలిపారు. అన్నపూర్ణ, తోటపల్లి, రంగనాయక సాగర్ తదితర ఉమ్మడి జిల్లాలో ఉన్న రిజర్వాయర్ల పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిరక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాత్రివేళ వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ప్రాణాష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్