మహిళలు స్వయం ఉపాధి పొందాలి.
-దుబ్బాకలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం.
దుబ్బాక యదార్థవాది ప్రతినిది
స్వశక్తితో మహిళలు ఎదగాలని దుబ్బాక నియోజకవర్గ కేంద్రమైన 13వ వార్డులో ఉచిత కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంబించిన ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి..ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మహిళా స్వయం ఉపాధి పొంది స్వశక్తి తో ఎదిగేలా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని గత రెండు మూడు సంవత్సరాల నుండి చేస్తున్నామని, నియోజకవర్గంలోని రాయపోల్ మండల కేంద్రంలో ప్రారంభించి 300 మందికి, మిరుదొడ్డిలో 50 మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేశామని, ప్రతి ఒక్క మహిళా ఈ శిక్షణ పొంది ఉపాధిని ఏర్పారుచుకోవాలని సూచించారు. 2006 నుండే ఈ ప్రజాహిత పౌండేషన్ సంస్థను స్థాపించి స్పోర్ట్స్, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాలు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అస సులోచన స్వామి, ఆర్గనైజేషన్ రజిత, ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ చారి, నరసింహారెడ్డి, స్వామి ప్రశాంత్ స్వామి, నవీన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.