25.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణరైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం.

రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం.

రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం.

-ఆనందోత్సవాల్లో రైతన్నలు..

-ఊరూరా రుణమాఫీ ఆనందోత్సవాలు..

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం పట్ల నియోజకవర్గంలో ఊరూరా రుణమాఫీ ఆనందోత్సవాలు నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ, రైతు సమన్వయ సమితి, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తున్నారని, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని రైతు లేనిదే రాజ్యం లేదని, దేశానికి అన్నం పెట్టేది రైతన్నలే అని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వంమే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ తో పాటు, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్న ప్రభుత్వం అని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత భూమి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు రాజమౌళి, నాయకులు గుడికందుల రాజిరెడ్డి, రాయిని పండు, ఏనుగుర్తి శ్రీనివాస్, మంతూరి శేఖర్, పెద్దపులి శ్రీకాంత్, ఫర్టిలైజర్ ప్రభాకర్, పాతూరు అంజిరెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్