పాడి రైతులకు సబ్సిడీ రుణాలు..
-గ్రామా రైతులు పశు సంపదలో ముందుండాలి..
-చైర్మన్ పేర్యాల దేవేందర్..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కోహెడ మండలంలోని అన్ని గ్రామాల పాడి రైతులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయిస్తానని చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు అన్నారు.. శనివారం మండలంలోని వరికోలు గ్రామ పాడి రైతులకు పాడి పశువుల కొనుగోలుకై సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ పాల ఉత్పత్తి దారుణ సహకార సంఘం వారు మంజూరు చేసిన రూ. 7,80,000లను ఆయన అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పాడి ఉత్పత్తులు బాగా పెరగాలని అందుకోసం రైతులు పశువులను పెంచి పోషించాలని రైతులకు సూచించారు. కరీంనగర్ పాల ఉత్పత్తి దారుణ సహకార సంఘం వారు పాడి రైతులను ప్రోత్సహిస్తున్నారని వారి సహకారంతో మండలంలోని గ్రామాలకు త్వరలో మరిన్ని రుణాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు పబ్బతి సుగుణమ్మ, జేరిపోతుల మనేమ్మ, గుండ తిరుపతి, గొంటి లక్ష్మయ్య, కొత్తూరి మనోహర్, ప్యాక్స్ సీఈఓ ముంజ మల్లికార్జున్, సిబ్బంది, వరికొలు మిల్క్ డైరీ ఛైర్మన్ సంది శ్రీనివాస్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.