సమస్యలతో సర్కారు దావఖన.!
-తాగునీటి కోసం తండ్లడుతున్న రోగులు.
-ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పనితీరు అద్దం పడుతుంది.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్వంత జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రికి ప్రతి రోజు వందల సంఖ్యలో వస్తున్న రోగులకు గత రెండు రోజులుగా పరిశుద్ద మైన తాగునీటి లేక రోగుల, వారి బంధువులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆసుపత్రిలో రోగులకు పరిశుద్ధమైన తాగునీటిని అందించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి పర్యవేక్షణ పనితీరు అద్దం పడుతుందని
వెంటనే ఆసుపత్రిలో పరిశుద్ధమైన తాగునీటిని అందించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి కృషి చేయాలని తాగునీటి సమస్య పరిష్కారం కోసం శనివారం సూపరింటెండెంట్ కలిసేందుకు వెళ్ళితే సూపరింటెండెంట్ ఆసుపత్రిలో అందుబాటులో లేరని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ తెలిపారు.