128వ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ.
యదార్థవాది మెదక్ ప్రతినిధి
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మ కన్నె గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ దాతగా సత్యా గ్రూప్ ఆఫ్ బిల్డర్స్ & ఇన్ఫ్రా డెవలపర్స్ సీ ఈ వో కుమ్మరి సతీష్ నీలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయి మాట్లాడారు. వీరనారి వీరవనిత చాకలి ఐలమ్మ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువ ప్రపంచానికి చాటి చెప్పినని చాకలి ఐలమ్మ వీరనారి వీరవనిత చాకలి ఐలమ్మ అని చెప్పుకొచ్చారని అన్నారు. కార్యక్రమంలో విగ్రహ దాత కుమ్మరి సతీష్, గ్రామ సర్పంచ్ కాజీపేట రాజేందర్, వైస్ ఎంపీపీ బొడ్ల నవీన్ గుప్తా, రజక సంఘం గ్రామ అధ్యక్షుడు చాకలి మల్లేశం, సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు,అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, కాయిత లక్ష్మణ్ ముదిరాజ్, బిఆర్ఎస్ కార్యకర్తలు, చంద్రం కృష్ణ గౌడ్, చిన్నంరెడ్డి, మన్సూర్, కౌడిపల్లి మండల రజక సంఘం అధ్యక్షులు చాకలి రాములు, కుకట్లపల్లి సర్పంచ్ కాంతారావు, కొట్టాల సర్పంచ్ నరహరి, సదాశివపల్లి సర్పంచ్ నర్సింగ్ రావు, గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.