27.4 C
Hyderabad
Thursday, July 31, 2025
హోమ్తెలంగాణతెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి డిపిఆర్ఓ వాట్సాప్‌ ఛానెల్‌.

తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి డిపిఆర్ఓ వాట్సాప్‌ ఛానెల్‌.

తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి డిపిఆర్ఓ వాట్సాప్‌ ఛానెల్‌.

-రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిపిఆర్ఓ వాట్సాప్‌ ఛానెల్‌ ప్రారంభం.

– రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి ప్రభుత్వ ఛానల్ ఇదే.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

జిల్లా మీడియా ప్రతినిధులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి ట్వీట్టర్ , వాట్సప్ , ఫేస్ బుక్ వంటి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ తాజాగా డిపిఆర్ఓ రాజన్న సిరిసిల్ల ( Dpro RajannSircilla ) పేరుతో బుధవారం ‘వాట్సాప్‌ ఛానెల్’ను ప్రారంభించింది.

ఈ ఛానెల్‌ ద్వారా జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుంచి వెలువడే ప్రకటనలను మీడియా ప్రతినిధులు, పౌరులకు చెరవేస్తుంది. ఇందుకోసం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ( డిపిఆర్ఓ రాజన్న సిరిసిల్ల ) వాట్సాప్‌ ఛానల్‌ను అనుసరించడం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కే తారక రామారావు, ఇతర VIP లు, జిల్లా కలెక్టర్ క్షేత్ర పర్యటనలు, సమావేశాలు , ప్రభుత్వ ప్రకటనల వార్తలను మీడియా ప్రతినిధులు, ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

మొట్ట మొదటి ఛానల్ ఇదే!

బుధవారం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం dpro rajannasircilla పేరుతో ప్రారంభించిన వాట్సప్ ఛానల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి ప్రభుత్వ ఛానల్ కాగా….
తెలంగాణ సమాచార ,పౌర సంబంధాల శాఖలోనూ ఇదే మొదటి ఛానల్ గా నిలిచింది.
గుడ్ మార్నింగ్ మీడియా ఫ్రెండ్స్ …
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మరింత ప్రభావంతంగా జిల్లా ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు మీ సంపూర్ణ సహకారం కోరుతున్నాను…
అంటూ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తొలి పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్ర మంత్రి కే తారక రామారావు గంభీరావు పేట పర్యటనకు సంబంధించి పోస్ట్ పెట్టారు.

ఛానెల్‌ ఇలా ఫాలో అవ్వండి!

మొదట వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌లో అయితే Updates బటన్‌ను క్లిక్‌ చేస్తే ఛానెల్స్‌ ట్యాబ్‌ కనిపిస్తుంది. ఇందులో ప్లస్‌ బటన్‌పై క్లిక్‌ చేసి Find Channels సెలెక్ట్‌ చేయాలి.

సెర్చ్‌ బాక్స్‌లో Dpro RajannSircilla అని టైపు చేయాలి. నేతన్న, మిడ్ మానేరు జలాశయం, శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం తో కూడిన ప్రొఫైల్ పిక్ తో కూడిన ఛానెల్ ను జాబితా నుంచి ఎంచుకోవాలి. ఆ తర్వాత ఫాలో బటన్‌ను క్లిక్‌ చేసి.. Dpro RajannSircilla ఛానల్‌లో చేరవచ్చు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్